Tuesday, August 25, 2009

ఏడుపంటే ఇదేనేమో.....

ఆమె కళ్లలోని ఎర్రటి జీరకు

కాళ్లకున్న పారాణి మసకపోయింది.

ఆమె కళ్లలోని నీటి చుక్కలు మృతసముద్రపు

ఉప్పుమడులు చేసాయి.

ఆమె ఇంటిముందు జాతకవాదానికి

హేతువాదానికి అంతులేని రగడ జరుతున్నది.

ఇంతకీ ఏమయిందంటే

ఆమెకు తాళి కట్టిన తర్వాత అతనికి తంతి వచ్చింది.

జన్మభూమి మానాన్ని కాపాడటానికి బయలుదేరాడు.

తన నెత్తుటి తొ సరిహద్దులో లక్ష్మణ రేఖగా మిగిలిపోయాడు.

వధువు విధవ అయ్యింది.

కన్నె నీరు కన్నీరు గా మారింది.

ఏడుపు అంటే ఇదేనేమో.

1 comment:

  1. చాలా బాగుంది సార్.
    .వీర జవాన్ వీరమరణానికి విధవగా మారిన ఓ వనితా
    నీ కంటనీరు కారనీకుమా

    ReplyDelete