Tuesday, September 1, 2009

మా వీధిలో ఈ మధ్యనే .....

శ్రీశ్రీ గీతాలను ఆలపిస్తున్నాడో త్రాగుబోతు.

ఆయన మాజీ ఎక్సైజ్ ఎస్సై ఈ మధ్యనే బెల్ట్ షాప్ పెట్టాడు.

నీళ్లు కరువయ్యాయని పాలవాడు

ఈ మధ్యనే వాటర్ టాంక్ క్రిందకు మకాం మార్చాడు.

స్కూలు మాస్టారు డి.ఎ., పి.ఆర్.సి. ల కోసం సమ్మెలోకి దిగాడు

ఈ మధ్యనే కాన్వెంటు ఆ స్కూలు విద్యార్ధులను కిడ్నాప్ చేసింది.

మా వార్డు మెంబరు కొత్తగా కాంట్రాక్టర్ అవతారమెత్తాడు

ఈ మధ్యనే డ్రైన్లు, సెమెంటు రోడ్లు మాయమయ్యాయి.

పూజారి గారు గుడి మూసే సారు.

ఈ మధ్యనే ఆలయభూముల రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు.

వీధి చివర పెద్ద బంగ్లాలో ఉండే ముసలి దంపతులు మాయమయ్యారు.

ఈ మధ్యనే వాళ్ల NRI  అబ్బాయి వృద్దాశ్రమంలో పడేశాడట.

నేను బ్లాగ్ కోసం 56 అక్షరాలను ఒడిసిపట్టుకొన్నాను

ఈ మధ్యనే భాషతో రమిస్తున్నాను, భావం పండటానికని.

3 comments:

  1. కవిత బాగుంది

    ReplyDelete
  2. క్షమించాలి..చెప్పదలకున్నదేమిటో సూటిగా చెబితే ఇతరుకు అర్థం అయ్యేలా వుంటుందని నా అభిప్రాయం..చివరి పంక్తుల బాగున్నాయి..

    ReplyDelete