Saturday, September 19, 2009

ఆమెకు బట్టలు కట్టండి

కోక విప్పుతూ కోలా తాగుతుంది

ఆమె దేహం వాణిజ్య ప్రకటనలకు పెట్టుబడి

రేంప్ మీద కేట్ వాక్ లు, స్క్రీన్ మీద కాట్ సీన్ లు

ఆమె స్కిన్ షో కు ఫ్లాష్ లైట్లు వెలవెల పోయాయి.

ఆమె జీవితం ఒక్ పేజ్ త్రీ కలైడో స్కోపు

అండర్ వేర్ లు అవుటర్ వేర్ లు అయ్యాయి.

రిబ్బన్ ముక్క రుమాలుగుడ్డ ఆమె దేహానికి నిండుదనమిస్తాయి.

పబ్ లో కిక్ లు, ఎక్స్టసీ మాత్రలు, ఎంగిలి కిస్ లు ఆమె వ్యాపకం.

రెడ్ బుల్ డ్రింక్ లు, వయాగ్రా మాత్రలు మగసిరికిచ్చే ఆమె కితాబు.

సగటు భారతీయవనిత ఆమె ముందు వెగటు అయ్యింది.

నగర యాంత్రిక జీవనంలో విలువల కోసం వలువలు విడిచింది.

గ్లోబలైజేషన్ గొబ్బెమ్మ

ఆమెకు బట్టలు కట్టండి.

6 comments:

  1. ఆలోచనాత్మకాశం....బాగుందండి!!!

    ReplyDelete
  2. వలువలు విడవడం నెగటివ్ విలువ (minus value) అవుతుంది కానీ పాజిటివ్ విలువ (plus value) ఎన్నడూ కాదు.

    ReplyDelete
  3. ru talking abt Kate Moss?

    ReplyDelete
  4. nice, nee visleshana chala bagumdi.

    ReplyDelete
  5. not bad just made to think

    ReplyDelete
  6. బాగుంది సార్.."నగర యాంత్రిక జీవనంలో విలువల కోసం వలువలు విడిచింది" డబ్బులకోసం చిన్న చిన్న దుస్తులేసుకుని , స్త్రీ తత్త్వానికి మచ్చతెస్తున్నారు.. ఎంతసంపాదించి ఏం లాభం.. గుప్తంగా వుంచవలసిన వాటిని వీధిలో వుంచి నవ్వులపాలవుతున్నారు..

    ReplyDelete